'అడగనిదే అమ్మయినా పెట్టదు' అన్న చందాన..
Tuesday, October 13, 2009
పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి మన ప్రభుత్వం నేర్చుకోవలసింది చాల ఉంది.
వరద బాదితుల కోసం వారు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా చేయి దూరే ప్రతీ చోటా చేయి చాపి తోచినంత సాయాన్ని పోగు చేస్తున్నారు. మన ప్రబ్తుత్వం ముసలి కన్నీరు కార్చడానికే సమయం సరిపోవడం లేదు.
నిన్నటికి నిన్న కేవలం మూడు కంపెనీలు కలిసి "వంద" కోట్లు ఇచ్చాయట, వరద బాధితులకు ఇల్లు కట్టించాడానికి. పని చేసే ప్రభుత్వం ఉంటె ఎంతయినా ఇవ్వడానికి జనం ముందుకు వస్తారు.
2 comments:
మన పెజా సేవకులు విరాళాలనుకూడా దిగమింగేరకమని వాళ్ళు తెలుసుకున్నారేమో ?
నా బాధ ఏంటి అంటే జనాన్ని మన నాయకత్వం కొంచెం కూడా inspire చేయలేకపోతుంది. యద్యూరప్పను చూడండి. బెంగుళూరులో రోడ్లన్నీ తిరిగి చాల సాయం పోగు చేసారు. అది చూసి రాష్ట్రమంతా అన్ని జిల్లాలలో అటువంటి కార్యక్రమాలు చేసారు.
మనకు అటు ప్రభుత్వం నిద్ర మొహం వేసుకుని ఉంది. ఇటు మిగతా పార్టీ నాయకులు అలానే ఉన్నారు.
కే.సి.ఆర్ వంటి వ్యక్తులు జోలు పట్టి పార్టీ ఫండ్ కోసం 'టీ' స్టాల్ లో టీ కలపడం, ఒక నిముషంపాటు తాపీ మేస్త్రి పని చేయడం, లాంటివి చేస్తారు. ఇలాంటి పరిస్థితులు వస్తే మాత్రం కుళ్ళు రాజకీయాలు మొదలు పెడతాడు.
Post a Comment