జగనన్నకు తీరాని అన్యాయం
Friday, October 9, 2009
ఓబామాకు నోబెల్ పురస్కారం ఇవ్వడం మన తెలుగు జాతికి అవమానం.
నోబెల్ బహుమతి జడ్జీలు వివక్ష చూపించి మన తెలుగు బిడ్డ "జగన్" ని విస్మరించడం అన్యాయం.
ప్రపంచమంతా తలదించుకోవలసిన విషయం....కేవలం వై యస్ బిడ్డ అన్న కారణం చేత ఇంత అన్యాయమా !!
6 comments:
తెలుగు బిడ్డ ని ఇన్నేసి మాటలంటున్నావ్ లే? యే అవార్డ్ వచ్చినా ఇచ్చినా మా జగనన్నకే చెల్లు. ముందే వై.ఎస్.ఆర్ పోయినప్పటికెల్లి మస్తు పర్షన్ పర్షన్ ఔతున్నాం.
ఆవేశంతో అన్నకు జరిగిన అన్యాయాన్ని జీర్నిచులోలేక అలా నా ఆవేదనను వెల్లగక్కాను.
ఇప్పుడిప్పుడే నేను వాస్తవ పరిస్థితులకు దగ్గరాగా ఆలోచించగాల్గుతున్నాను.
నోబెల్ బహుమతి మన యువ నేత, ఆశా కిరణం "రాహుల్ గాంధీ"కి ఇవ్వాలి !!!
ఏంది, ఎంత తండ్రి లేని బిడ్డ అయితే మాత్రం, మా జగనన్నను అంత తీసేస్తారా?
ఓబామా ఏమన్నా బస్సులు తగెలెట్టించగలడా?
వాళ్లయ్య పోతే శవం పక్కన సంతకాలు పెట్టించగలడా?
ఓ జిల్లాకు ఏకంగా వాళ్లయ్య పేరు పెట్టించగలడా?
అయిదు ఏళ్లలో, దగ్గర దగ్గర ఓ 50 వేల కోట్లనుండి, లక్ష కోట్లు వెనక వేయగలడా?
పేపరెట్టి, చవకగా ఇవ్వగలడా?
అసలు ఎదో గవర్న్మెంట్ వి గాక, తనకంటూ ఓబామా కు సొంత సేనలు ఏమన్నా మా జగనన్నకు ఉన్నట్లు ఉన్నాయా?
సొంత సేనను బెట్టుకొని, అన్ని బస్సులు కాల్చకుండా, మత కలహాలు రేపకుండా, అక్కడక్కడా స్థలాలు కబ్జా చేయకుండా ఉన్న , మా జగనన్న కు నోబెల్ శాంతి ఇవ్వాలా, లేక ఓబామాకు ఇవ్వాలా?
అందుకనే అంటారు మంచికి రోజులు కాదని, తల్లి లాంటి బంగారమ్మ, దీనికి న్యాయం చేస్తుంది అన్న ఆశ మాకు ఉంది అద్యక్షా!!!
అందరూ క్షమించాలి..
చిన్న పొరపాటు వలన నేను ఒక anonymous, వెంకట గణేష్ గారు, మరొక anonymous మరియు సత్యరాజు గారు చేసిన వ్యాఖ్యలను పోస్టు చేయలేకపోతున్నాను.
వారి వారి వ్యాఖ్యలను కాపీ చేసి ఈ క్రింద పోస్టు చేస్తున్నాను. మరలా క్షమించాలి.
అంజి బాబు.
Anonymous chepparu,
అదే మరి పెరటి చేట్టు వైద్యానికి పనికిరాదంటే, మా జగన్ అన్న కంటే ఓబామాలు, మన్మోహన్ లూ ఏమి గొప్ప అంట. వాళ్లకేమనా సొంత సేనలు ఉన్నాయా? ఉండి మా జగనన్న లాగా వాళ్లెమన్న శాంతి బాటలో నడుస్తున్నారా?
యమ అర్జెంట్ గా ఇవ్వనందుకు ఓ నాలుగు బస్సులు మా జగన్ సేన కాస్త ఈ వరదల గోడవ తగ్గాక, కాల్చాల్సిందే!!
వెంకట గణేష్ గారు cheppaaru,
విషయాన్ని సూటిగా చెప్పారు.
Anonymous cheppaaru,
హార్వర్డ్ ఐనా , స్కూల్ డ్రాప్-అవుట్ సోనియా ఆజ్ఞలన్నిటికీ గంగిరెద్దులా తలూపుతాడు, కూడా.
కాబట్టి 'గంగిరెద్దు అవార్డ్' లేదా ' బొడ్రాయీ అవార్డ్ కు అర్హుడేమో గాని, శాంతి అవార్డ్ కు కాదు.
( బొడ్రాయి - అంటే కోటవాకిలి ముందు పూర్వం ఒక రాయి వుంచేవారు, అది )
Satya Raju's comment,
I totally agree with you Sai, but Manmihan should be more aggressive in bringing some solutions to the current state of affairs first with our beloved neighbours and then acreoss the globe(MMS does many things without getting any publicity but others get more publicity without doing anything e.g. Barack)
Satya Raju
Post a Comment