చంద్రబాబు చెప్పేశాడు..!!??
Saturday, May 30, 2009
చంద్రబాబు చెప్పేశాడు. ఎన్నికల ఫలితాల రోజున మాట ఇచ్చినట్లుగా సరయిన విశ్లేషణ చేసుకుని తాము ఓడిపోవడానికి "నిజమయిన" కారణాలను బయటపెట్టాడు.
2. తామూ ఓడిపోవడానికి మరొక కారణం జనం తమకు వోటు వేయకపోవడం కాదట. వేరే పార్టీలకు వోటు వేయడమట. ఆహా!!
టెక్నాలజీని ఆహా ఓహో అన్న రీతిలో ప్రోత్సహించిన నాయుడుబాబు ఈ రోజు ఓడిపోయిన తరుణంలో అదే టెక్నాలజీకి వీపు చూపించాడు. ఇంకా నయం. జనం వోటు వేయకపోవడానికి తాము మాట ఇచ్చిన రెండు వేల రూపాయలు చాలవనే ఉద్దేశ్యంతో అని చెప్పలేదు.
ఈ కార్యక్రమంలో కొసమెరుపు మరలా బాబాయి-అబ్బాయిల ద్వయం చెప్పిన సినిమా డవిలాగులు (పార్టీ కోసం ప్రాణాలయినా ఇస్తాను, వగైరాలు...)
5 comments:
ప్రజారాజ్యం తమ వోట్లు చీల్చింది అని తెలుగు దేశం వాదించడం హాస్యాస్పదంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాలలో ప్రజారాజ్యం పార్టీకి కార్యకర్తలు లేరు. అయినా శ్రీకాకుళం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఒక్క సీట్ మాత్రమే వచ్చింది. నిజానికి కొన్ని చోట్ల ప్రజారాజ్యం కాంగ్రెస్ వోట్లు చీల్చింది. ఇచ్చాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే ప్రజారాజ్యంకే ఎక్కువ వోట్లు పడ్డాయి.
ఇంకా ఎన్నికలు రాహుకాలంలో జరిగాయి అని చెప్పలేదు! :-P
చేతకానివాడికి జాతకాలు, ముహూర్తాలు పేర్లు చెప్పుకోవడం కష్టం కాదు.
జాతకాలు, ముహూర్తాలు అంటే నాకు 'కేసిఆర్' గుర్తుకువస్తున్నాడు. ఏ పని మొదలు పెట్టినా కూడా ముప్పై పూజలు మూడొందల ముహూర్తాలు చూసోకుంటాడు.
జనం తనకి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి మొట్టికాయలు వేసినంత పని చేసారు. వెరీ గుడ్!!
చంద్రబాబు చేతకాని వాడే: http://haachcheryam.blogspot.com/2009/07/blog-post.html
Post a Comment