కటకటా!!!! ఏమి ఈ దుస్థితి??
Sunday, May 31, 2009
అయ్యో. అయ్యో. అయ్యో. స్పీకర్ పదవి కూడా పోయిందా!! ఓహ్ మై డాగ్!!!
ఇక లాభం లేదు. కాంగ్రెస్ హైకమ్మాండ్ ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. మన యంపీలను చూస్తుంటే వాళ్ళ వలన ఏమీ అయ్యేట్లు లేదు. కాంగ్రెస్ పార్టీకి సరే బుద్ధి లేని పని చేస్తున్నారే. అస్సలు మిగిలిన రాజకీయ పక్షాల వారు ఏమి చేస్తున్నారు. కాంగ్రెస్ ను ఎత్తి కుదేయ్యాలి అనిపించడం లేదా.
అన్ని పక్షాలు కలిసి కాంగ్రెస్ ను తూర్పారబట్టాలి. ఒక propaganda వార్ మొదలు పెట్టి అన్ని వైపులనుండి కాంగ్రెస్ ని, వారి హై కమాండ్ ని ముద్దాయిలుగా చేసి టీవీలలో, పేపర్లలో అన్నిటిలోనూ దాడి చేయాలి.
భారతీయ జనతా పార్టీ ఈ లెక్కన ఎంత మేలండీ!! తమ పార్టీ నుండి రాష్ట్రంలో ఐదుగురు యంపీలు ఉంటె అందులో ముగ్గిరికి మంత్రి పదవులు ఇచ్చింది. వేరే రాష్ట్రం కోటాలో రాజ్య సభ సభ్యుడయిన వెంకయ్య నాయుడుని కాబినెట్ మంత్రిని చేసింది.
నా బాధ అధికారంలో వాటా గురించి కాదు. మన రాష్ట్ర ప్రజలకు చేయవలసిన కనీస మర్యాద గురించి. ఇంత మేలు చేసిన రాష్ట్రాన్ని ఎత్తి ఎవరయినా తల మీద పెట్టుకుంటారు కానీ, వీళ్ళు ఎంట్రా అంటే తొక్కి పాతాళంలోకి పంపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే.....అందరినీ పిలిచి వరుసలో లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. ముఖ్యంగా నాలుసో సారో, ఇదో సారో గెలిచిన వారిని.
2 comments:
బాగా చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ైల్వే మినిస్ట్రీ నార్తు వాళ్ల దగ్గర ఉంది. అందులోను బీహారుకు చెందిన లాలూ, పాశ్వాన్, నితీష్ కుమార్లు. ఎన్ని రైళ్లను వీళ్లు తమ నియోజక వర్గానికి వేసుకున్నారో, లేక పెంచేరో తెలుసుకదా. అసలు మంత్రిపదవులు కూడా రొటేషన్ లో ఉండాలి.
ఎన్నికలు అయిపోయే సరికి రామోజీ రావు విమర్సలలో పదును తగ్గింది చూసారా!! ఎన్నికలు జరుగుతున్న సమయంలో అయితే భీబత్సమయిన ప్రాపగండా నడిపాడు. ప్రతీ రోజు. అదీ తమ పార్టీ అధికారంలోకి రావాలి అని.
ఇప్పుడు అస్సలు సిస్సలు విషయం ఉన్నప్పుడు, తెలుగు వాడి కోసం మాట్లాడాల్సినప్పుడు కేవలం చిన్న చితకా వ్యాసాలూ రాసి పైపైన లాగించేస్తున్నారు.
Post a Comment