రాష్ట్రానికి వెన్నుపోటు

Thursday, May 28, 2009

కాంగ్రెస్ వారికి ఎలా ఉందొ తెలియదు కానీ నాకు మాత్రం మింగుడు పడడంలేదు. నా దృష్టిలో మన రాష్ట్ర యంపిలు పేపర్లకి ఎక్కడం, మీడియాకి ఇంటర్వియూలు ఇచ్చి తమ గోడు వెల్లబోసుకోవడం సుద్ధ దండగ.

తాడో పేడో తేల్చుకుందాం అని బయలుదేరి గుంపుగా వారి పార్టీ అధిష్టానాన్ని నిలదీయాలి. ఇస్తారా లేదా అని. అరె కనీసం రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకపోతే ఎలా.

ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకు నాలుగు మంత్రి పదవులు, 16 మంది యంపిలను పంపిన కేరళకు 6 మంత్రి పదవులు, 21 మంది ఉన్న ఉత్తరప్రదేశ్ కు 5 మంత్రి పదవులు. ఇలా పోతా ఉంటే ప్రతీ రాష్ట్రం కంటే మనమే వెనుక బడి ఉన్నాం. మన వారు చేసిన పాపం ఏంటి. మిగిలిన రాష్ట్రాలు చేసిన పుణ్యం ఏంటి.

దాదాపుగా ఒంటి చేత్తో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకాన్ని చేసిన ఆంద్ర రాష్ట్ర ప్రజలు "కూరలో కరివేపాకులా". ఇంతా చేసిన ఇవేళ మన్మోహన్ సింగ్ "ప్రతిభ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నాం" అని తెలియజేసారు. మన యంపిలలో లేని ప్రతిభ వరుస కరువులతో బాధపడుతున్న మహారష్ట్రకి ఒక్క సరయిన పరిష్కారాన్ని చూపలేకపోయిన , కరవు పీడిత ప్రజలకు కనీస ఓదార్పుగా కూడా ఉండలేకపోయిన "విలాసరావ్ దేశ్ముఖ్" వంటి వారిలో ఏముందో.

ఇది కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవలసిన చర్య. తమను అభిమానించి తమ పనితనాన్ని మెచ్చుకున్న రాష్ట్ర ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసి నవ్వులపాలు చేసారు.

ఇంతా జరిగితే జాతీయ మీడియా మాత్రం తమ చెత్త బుద్ధి పోనిచ్చుకోలేదు. ప్రధాని, సోనియా, రాహుల్ లను పదే పదే "ఉత్తరప్రదేశ్ కి ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు". కళ్ళకు గంతలు కట్టుకుని ఉత్తరభారతం మాత్రమే ప్రపంచం అనుకుంటున్నారు ఎప్పటిలానే.

ఇంతా చేసి తన కాబినెట్ పని పూర్తి అవ్వగానే తనకు ఇంకేం సబంధం లేదు అని చేతులు దులుపుకుంటూ జెరూసలెం వెళ్లిపోయారు మన ముఖ్యమంత్రి. బావుంది. చాల బావుంది.

5 comments:

పానీపూరి123 said...

> తాడో పేడో తేల్చుకుందాం అని బయలుదేరి గుంపుగా వారి పార్టీ అధిష్టానాన్ని నిలదీయాలి.
మనోళ్ళకి,అంత దృశ్యం ఉందా?

Anji Babu said...

మన వాళ్లకు అంత 'సిత్రం' లేదులెండి. కానీ...వీరు ఒక ఐదారుగురు కలిసి సమిష్టిగా ఉండి రాజీనామా బాణం వేస్తే అధిష్టానం చేయగల్గినది ఏమి ఉంటుంది?

సమస్య పదవుల గురించి కాదు. వ్యక్తుల గురించి కాదు. మన రాష్ట్ర ప్రజల మనో భావాలకు సంబందించినది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెపుతారు. మన MLAs తో బయటి వారికి రాజ్యసభ పదవులు కట్టబెట్టడం, వారికే మత్రి పదవులు ఇచ్చి మనవారిని మూల కూర్చోపెట్టడం ఎంత వరకు సమంజసం? కదా!

వీళ్ళు ఇన్నాళ్ళు కాళ్ళు నొక్కడం బాగా అలవాటు అయ్యి ఇంత దూరం తీసుకు వచ్చారు.

కామేష్ said...

మన తెలుగువాళ్ళు వట్టి చవటలోయ్ అన్నాడో మహా మనిషి వెలకటికి. నాకు మాత్రం చాలా బాధేసింది. అది కూడా, తెలుగువాడి ఆత్మగౌరవం నినదించి, పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తెలుగుబిడ్డ నందమూరి తారక రామారావు పుట్టిన రోజునే, మన తెలుగుతేజాలు వెలవెలలాడిపోవడం చాలా దురదృష్టకరం. నాకు చాలా బాధ అనిపించిన రెండు ప్రకటనలు -
1. పురంధేశ్వరి - మా నాన్నగారి పుట్టిన రోజున నాకు మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉంది.
- నా వ్యాఖ్య - అమ్మా పురంధేశ్వరీ, మీ నాన్నగారు ఏ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పాటు పడ్డారో ఆ తెలుగు వాడి పౌరుషం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినందుకు నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. నీకే కనుక సిగ్గుంటే మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి పెట్టి మాట్లాడు. అదీ మీ నాన్న గారికి అసలైన నివాళి.
ఇకపోతే రెండో ప్రకటన మన ముఖ్యమంత్రిది, అదికూడా జెరూసలేం నుండి అమ్మకు స్వయంగా పంపింది.
2. కేంద్ర కేబినెట్ కూర్పు పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతిభకు పూర్తి న్యాయం జరిగింది. మొయిలీ, గులాంనబీ, తదితరులకు రాష్ట్ర కోటాలోనే మంత్రిపదవి వచ్చింది. వారు రాష్ట్రానికి పరిశీలకులు.
నా వ్యాఖ్య - అయ్యా.. ముఖ్యమంత్రిగారూ.. చాలా బాగా చెప్పారూ... రాష్టంలో ఇంక ప్రతిభావంతులు లేరూ .. ఉన్న నలుగురికీ కూడా సహాయమంత్రికి సరిపడా ప్రతిభే ఉందీ... అని డైరెక్టుగా చెప్పాల్సింది. ఈ బడాచోర్ నాయకులను గురించి ఇంతకంటే కూడా ఘోరమైన భాషలో తిట్టాలని ఉంది. కాని సంస్కారం అడ్డొస్తోంది. మరో తెలుగుజాతి పౌరుషానికి పట్టం కట్టే అసలైన నాయకుడి కోసం వెతుకుతున్నాం. వస్తాడు. తప్పకుండా వస్తాడు. ఆనాడు మీరంతా, మీ పార్టీతో సహా మరి కోలేనంతగా పాతాళానికి తొక్కబడడం ఖాయం. ఇది జరుగుతుంది. జరిగి తీరుతుంది.

హరివిల్లు said...

కాంగ్రెస్ MP లకి ఇంత కన్నా గుండె ధైర్యం ఉంటుందని మనం ఎప్పుడూ అనుకోలేదు.మనం 33 మంద MP లని ఇచ్చినా మనకు మిగిలేది మాత్రం సున్నా.

మన కాంగ్రెస్ వాళ్ళకు కాళ్ళు మొక్కడం, భజనలు చెయ్యడం తప్ప రాష్ట్రం గురించి అదుగుదామిని ఎప్పుడూ లేదు.

SAMBAMBA said...

Tamil nadu developed at fast pace because of their cabinet berths they got in previous coalition governments,even in present UPA government they put state interests in top priority.ALL MP & CM should meet regularly on quarterly basis with PM & Sonia to get our projects Irrigation projects completion on fast track

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP