మరింత బాధ్యతతో ఆడాలి...
Sunday, October 25, 2009
ఇవేల్టి మ్యాచ్ ఆరంభం-మధ్యలో ఎంత బోర్ కొట్టిందో చివరి ఐదు ఓవర్లు హర్బజన్, ప్రవీణ్ ల అద్భుత బ్యాటింగ్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ మధ్య batsmen విఫలమయిన అనేక సందర్భాలలో హర్బజన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ఆటను చూసి మన వీరులు సిగ్గు తెచ్చుకోవాలి.
సురేష్ రైనా బ్యాటింగ్ వరుసలో ఇంకా ముందు రావాలి. టాప్ ఆర్డర్లో పోరాట పటిమ సన్నగిల్లింది. ఎంతో కొంత కొట్టేసి సర్దేస్తున్నారు. ఒకటి రెండు మ్యాచిలు అయితే పర్లేదు. కాస్త అటు ఇటుగా ఈ సీజన్ అంత అలాగే జరుగుతూ వస్తుంది.
మీడియాతో మాట్లాడుతూ ఏడు మ్యాచిలు ఉండడం వలన సిరీస్ ఆరంభంలో కొన్ని మ్యాచిలు ఓడిన టీము తిరిగి పైకి రావడానికి అవకాశం ఉంటుందని అన్నాడు. చూడబోతే అలానే ఆదేలాగా ఉన్నారు.
0 comments:
Post a Comment