ఇంత తొందరేంటి?
Thursday, September 3, 2009
రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే వెంటనే మరొక వ్యక్తిని కొత్త ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. అలా ముఖ్యమంత్రి అయ్యిన వ్యక్తికి తనకు నచ్చిన కాబినెట్ ను ఎంచుకునే అధికారం ఉంటుంది.
కేంద్రం నుండి వీరప్ప మొయిలీ, ప్రిథ్విరాజ చవాన్ మొన్ననే వచ్చారు. వారు హైదరాబాద్లోనే మకాం వేసారు.
కేంద్ర పరిశీలకులు నగరంలోనే ఉన్నపటికీ, రోశయ్యను తాత్కాలిక ముఖ్యమంత్రిని చేయవచ్చు అనే పుకార్లు వచ్చినప్పటికీ మన కాబినెట్ లో మంత్రులు మరియు కాంగ్రెస్ శాసనసభ్యులలో అధికులు 'జగన్' ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం, హైకమాండ్ ను కోరడం జరిగింది.
ఇప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనలు:
1. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులలో అనేక మంది వై యస్ అడుగుజాడలలో నడిచి పైకి వచ్చారు అనేది వాస్తవం. అందువలన స్వామి భక్తిని జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేసి చూపించుకున్తున్నారా?
2. జగన్ వస్తే తండ్రి తీసుకున్న నిర్ణయాలకు, చేసిన నియామకాలకు పెద్ద మార్పులు చేర్పులు చేసే అవకాశాలు తక్కువ ఉండవచ్చు అనే ఆలోచనతో తమ తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడం, (అది కాబినెట్ పదవులు కావచ్చు లేక ఇతరత్రా వ్యవహారాలు కావచ్చు) సులువు అనే ఉద్దేశ్యంతో ఆ డిమాండ్ లేక ప్రతిపాదన చేసారా?
ఇంకా ఏమయినా కోణాలలో ఇది చూడవచ్చా? లేక నేను మాత్రమే ఇలా ఆలోచిస్తున్నానా!!
0 comments:
Post a Comment