ఈ సారి బలిపశువు ఎవరు ?
Thursday, May 21, 2009
ఇప్పుడే ఎక్కడో చదివాను. ఇంకొక వారంలో తెదేపా తమ పార్టీ మహానాడు నిర్వహించనున్నారట.
పోయిన సారి ఎన్నికలలో ఒదాక ఇలాగే జరిగిన మహానాడులో ఒక వ్యక్తి వచ్చి మైకు పట్టుకుని "వచ్చింది పనికి ఆహారం బియ్యం. అది అయ్యింది మన పాలిట దెయ్యం" అని తెదేపా చేసిన అనేక తప్పులను గూర్చి ఒక మంచి జానపద గేయం లాంటిది పాడాడు.
అప్పుడు తప్పుని పూర్తిగా బియ్యం మీద నెట్టేశారు ( కొంత మంది ధైర్యవంతులు చంద్రబాబు లోపాలని కూడా ఎత్తి చూపారనుకొండీ), ఈ సారి ఎవరు ఏ పాట పాడతారో. రెండు వేలు డబ్బులు గురించా, బాబాయి కొడుకుల తొడ కొట్టటాలు, సినీ డవిలాగుల గురించా, లేక రోజా మేడం 2004 లో చెప్పినట్లు "జనం పిచ్చోల్లండీ" అని జనం మీదకి తప్పుని తోస్తారా చూడాలి ?
2 comments:
బలిపసువులు ప్రజలే.. నాయకులకేమి ఢోకా లేదు అని నా అభిప్రాయం
జనం పిచ్చోళ్ళు అని అనుకున్నారు కాబట్టే ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ప్రచారం చేశారు.
Post a Comment