మెట్రో అస్సలు కదిలేనా?
Thursday, May 21, 2009
వై యస్ గత ఐదేళ్ళ పాలనలో బాగా నష్టపోయింది ఎవరూ అని అడిగితే హైదరాబాదు నగరవాసులనే చెప్పాలి.
ఏటేటా పెరుగుతున్న నగర జనాభా. అదే విధంగా పెరుగుతున్న వాహనాల సంఖ్యా. ఇరుకవుతున్న రోడ్లు. దానికి తోడు గాలి కాలుష్యం. ఇవన్నిటికీ మూలం అతి పెద్ద సమస్య అయిన ట్రాఫ్ఫిక్.
ఎప్పుడో మొదలు పెట్టవలసిన మెట్రో పనులు నాలుగేళ్ళు నాన్చారు. తీరా ఇదో ఏట ఒక కంపెనీని పట్టుకుని వారికి పనులు అప్పగిస్తే అది కాస్త స్కాములో కూరుకుపోయింది. పనులు అడుగు ముందుకి కదల లేదు. ఐదేళ్ళ ముందు పరిస్థితీ నేటి పరిస్థితీ ఒకటే అని చెప్పడానికి కూడా సిగ్గు పడాల్సిన పరిస్థితి.
ఫలితం నగరం ఐదేళ్ళ విలువయిన సమయం కోల్పోయింది. ఇది ఎప్పటికీ తిరిగి రానిది. అస్సలే ఇటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏండ్ల తరుబడి జరుగుతాయి. దీనికి ప్రభుత్వ అలసత్వం మరియూ ఎవియస్ రెడ్డి వంటిఖరీదయిన పెద్ద ఉద్యోగుల నేర్పరితనం తోడైతే ఏం జరుగుతుందో మనం గత ఐదేళ్ళు చూస్తూనే ఉన్నాం.
ఇకనైనా ప్రభుత్వం త్వరాగా స్పందించి ఆ స్కాము విషయం ఒక కొలిక్కి తెచ్చి ఆ పనులేదో మొదలు అయ్యేలాగా చేస్తే వచ్చే ఐదేళ్ళకి కనీసం సగం పనులు అయినా పూర్తవుతాయి. సక్రమంగా నడుస్తున్న ఢిల్లీ మెట్రో పనులే పదేళ్ళు అయినా ఇంకా పూర్తి కాలేదు. ఇది ఎప్పటికయ్యేనో?
0 comments:
Post a Comment