రాలిపోయే పువ్వా నీకు.....!!
Thursday, May 21, 2009
చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేదు అని బాధ పడుతున్న వారికి ఎందుకు బాధపడనవసరం లేదో ఈ లింకు చూస్తే కాస్త అర్థం అవుతుంది.
తెలుగులో PureAndhra.com
© Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008
Back to TOP
11 comments:
చంద్రబాబు ఏమైనా త్యాగమూర్తా? అతను ఓడిపోయినందుకు ఎందుకంత బాధ? కమ్మ సుప్రీమసీ ఫీలింగ్ వల్లే చంద్రబాబుకి సపోర్ట్ ఇస్తున్నట్టు ఉన్నాను. నేను మా కులానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, అది కూడా మా బంధువు ఓడిపోవాలని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో అతను రెండు సార్లు MLAగా ఉన్నప్పుడు తన కులానికి చెందిన వాళ్ళ భూముల్ని కూడా ఆక్రమించుకుని బడా భూస్వామిగా ఎదిగాడు. అతను ఎలాగూ ఈ ఎలెక్షన్లలో కూడా ఓడిపోయాడు. చంద్రబాబు ఏమీ ప్రజాసేవకుడు కాదు, అతను ప్రజాబంధువు అని భ్రమపడడం హాస్యాస్పదం కూడా. దోచుకు తినేవాళ్ళని కులం పేరుతోనో, మతం పేరుతోనో ఆరాధించడం హాస్యాస్పదం. సొంత మామకే వెన్నుపోటు పొడిచినవాడు కులాన్ని గొప్పగా ఉద్దరిస్తాడనుకోవడం అంత కంటే పెద్ద జోక్.
కుల ప్రయోజనాలు గురించి కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు గురించి ఆలోచించండి. కుల సుప్రీమసీ ఫీలింగ్ వల్ల నయా పైసా ప్రయోజనం ఉండదు.
@ప్రవీణ్
మీరు ఉన్నపళంగా కులం గురించి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదండి.
ఒకవేళ నేను చంద్రబాబుని సమర్దించాను అనుకుంటే పొరపాటు. నేను పెట్టిన లింకు చూస్తే నా పూర్తి భావం అర్థం అవుతుంది.
ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కమ్మ వారే కోరుకోవాలని ఏముంది. అలా అయితే పట్టుమని పాతిక లక్షల వోట్లు కూడా వచ్చేవి కాదు గురుడికి.
నేను మిమ్మల్ని ఉద్దేశించి విమర్శించలేదు. యూట్యూబ్ లో నేను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెట్టిన వీడియో చూసి ఒకడు నన్ను బస్తీ కాపు లంజకొడుకా అని తిట్టాడు. మేము కాపులం కాదు. అతను చంద్రబాబు నాయుడి కులానికి చెందినవాడు కాకపోతే నన్ను కులం పేరుతో అనుమానించాలని అతనికి ఎందుకనిపించింది? కోస్తా ఆంధ్రలో కమ్మవాళ్ళకి ప్రధాన రైవల్స్ కాపులు కాబట్టి నన్ను కాపువాడిగా అనుమానించాడు. అంతే కానీ నేనేమీ కులం పేరు చెప్పుకోలేదు.
అర్థం అయ్యింది.
ఈ కుల గజ్జి వగైరాలు అన్నీ ఇన్నాళ్ళు ఒక ఎత్తు అయితే ఇక మీదట మరొక ఎత్తు. ఇన్నాళ్ళు రెండు పార్టీలు రెండు ప్రధాన కులాల ప్రతినిధులని చెప్పడం జరిగితే చిరు రాకతో ఇంకొక కులానికి కాస్తంత పొలిటికల్ కొవ్వు వచ్చింది. సో కులాలు ఇంక చాల కాలం వరకు హాట్ టాపిక్ గా ఉంటుంది. మనం ఏమీ చేయలేము.
@అంజి గారు
ఆ వ్యాసం మొత్తం చదివాను. అది కేవలం 2003 లొ వివిధ రాష్ట్రాలతో పోల్చి చూపిస్తుంది. అంతెకానీ 1994 లొ ఆయా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, 2003 లో ఎలా ఉన్నాయి... 1994 లొ మన రాష్టృఅ పరిస్థితి ఏంటి ఆయా రంగాల్లో?
మన రాష్ట్రం వరకు మాత్రమే చూసుకుంటే 1994 వరకు వృద్ధి రేటు ఎలా ఉండేది? ఆ తరవాత 2003 వరకు ఎలా ఉంది? అతను విధానాల వల్ల 2003 తరవాత ఏ విధంగా రాష్ట్రం ఫలితాలు పొందింది?
ఆ వ్యాసంలోనే కొన్ని సూచిల్లో కేవలం తమిళనాడు, కేరళాల వెనకే ఉంది అన్న విషయానికి వ్యాసకర్త ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉంది...
నేను ఇంతకుముందు చాలా సూచీలకి సంభందించి 1994 నుండి 2003 మరియు 1999 నుండి 2003 ల వృద్ధి రేటు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితేను, అంతకుముందు మన రాష్ట్ర వృద్ధి రేటుతో పోల్చితేను ఎలా గణనీయమైన మార్పుని సాధించిందో సేకరించి వివిధ బ్లాగుల్లో పోస్టు చేసాను...
మొత్తానికి ఆ వ్యాసం మన రాష్ట్రపు, మిగిలిన రాష్ట్రాల గత వృద్ధి రేటుని పరిగణనలోకి తీసుకోకుండా, వ్యాస కర్త తనకి ఇష్టమొచ్చినట్టు రాసుకున్నాడని అవగతమవుతుంది.రచయిత ఎన్నుకున్న పదాలు పక్షపాత ధోరణిని ఆవిష్కరిస్తున్నాయి.ఇలాంటి తల తోక లేని విశ్లేషణలు అంతర్జాలంలో వెతికితే చాలా కనపడతాయి. పరిశీలించే ఆసక్తి ఉంటే, అలాంటి రచనలకి ప్రాముఖ్యత ఇవ్వాలా వద్దా అనే విచక్షణ కూడా అలవాటు పడుతుంది.
ఒక వ్యక్తికి పేరు రావడం అనేది తను ఎంత వృద్ధిలోకి వచ్చాడు అనే దాన్ని బట్టే కాదు, తన పని సంస్కృతి ఎలా ఉంది, విధి విధానాలు ఎలా అమలు చేస్తున్నాడు అనే దాని బట్టి కూడా పేరు సంతరించుకుంటాడు.
చంద్రబాబు నాయుడి కాలంలో మూత పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి ఈనాడులో ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. "వార్త"లో మాత్రం వ్రాయడం జరిగింది. మా శ్రీకాకుళం జిల్లాలో కూడా వందలాది పరిశ్రమలు మూత పడ్డాయి. జళగం వెంగళరావు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వృద్ధి చెయ్యాలనుకున్నాడు. కొన్ని పరిశ్రమలకి భూములు అందించాడు కూడా. చంద్రబాబు నాయుడు పెంచిన టాక్సులు, కరెంట్ చార్జిల భారం వల్ల ఆ పరిశ్రమలు మూత పడ్డాయి. గ్రామీణ ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు మూసి వెయ్యించి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలని ప్రోత్సహించడమే అభివృద్ధా?
@ ఏకాంతపు దిలీప్ గారు
నేను పెట్టిన లింకులో ఆ రచయిత చంద్రబాబు హయాం మొత్తాన్ని కవర్ చేయలేదు అనేది వాస్తవం. తప్పకుండా నేనే ఒక రోజు వివిధ parameters ని కొలమానికగా తీసుకుని ఒక పూర్తి లిస్టు తయార చేయడానికి ప్రయత్నిస్తాను. చంద్రబాబు చాల పెద్ద తప్పులు చేసాడు అనేదే నా వాదన కాని అతని హయాంలో అస్సలు ప్రగతి లేదు అని కాదు. కాకపోతే చేసిన కాస్త పనికి కొండంత ప్రచారం జరిగేది.
ఇక రచయిత కొన్నిటి మాత్రమే ప్రాదాన్యత ఇచ్చాడు వేరే వాటికి ఇవ్వలేదు. అలా ఎందుకు చేసాడు అనే అంశానికి నేను వకాల్తా పుచ్చుకోలేను అని గమనించగలరు. అక్కడ కొన్ని స్టాట్స్ ఉన్నాయి అని మాత్రమే నేను ఆ వ్యాసాన్ని ఎంచుకున్నాను. రచయిత గొప్పవాడు అని చెప్పడానికి కాదు.
ఒక రకంగా చెప్పాలంటే రచయితా కేవలం సాకేతిక అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాడు. క్షేత్ర స్త్యాయిలో చంద్రబాబు పాలనలో మూతబడా ప్రభుత్వ పరిశ్రమలు, దివాలా తీసిన పాల డైరీలు, అత్యంత సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర రైతాంగానికి సంబందించిన అంశాలు ఏవీ లేవనేత్తలేదు అంటే ఇది చంద్రబాబు పాలన గూర్చిన పూర్తి విశ్లేషణ ఎప్పటికీ కాలేదు.
-> కొన్ని సూచిలో కేవలం తమిళనాడు, కేరళల వెనుక మాత్రమే ఉంది:
నిజమే. అవి మాత్రమే తీసుకుని మనం సంబర పడిపోదాం అంటారా?
మనం బాగా వెనుకబడిన సూచీలలో like Per capita income, literacy rate (we were doing worse than national average on both counts), electricity consumption, వాటిని వదిలేసి జనాభా వృద్ధి రేటు వంటివి జాతీయ యావరేజ్ కన్నా తక్కువ ఉందన్న విషయాన్నే చెప్పుందాం అంటారా?
@సేకరించి వివిధ బ్లాగుల్లో పోస్టు చేసాను...
మీరు ఆ పోస్టుల లింకులను నాకు సూచించగలరా? అవి చూసి చంద్రబాబు పాలన గూర్చి కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నా అవాగాహనకి తోడ్పడతాయని ఆశిస్తాను.
@ చంద్రబాబు పని సంస్కృతీ
ఫలాలు చూపని పని సంస్కృతీ ఎంత బావుంటే ఏమి ప్రయోజనం చెప్పండి. ముఖ్యమంత్రి అనే దర్పం ఉంటె సరిపోతుందా?
వారాలు తరబడి ప్రభుత్వ ఉద్యోగులు తమను మారుమూల పల్లెటూళ్ళకు పంపి చేయిస్తున్న సర్వేల వలన ఆ ప్రాంతాల ప్రజలకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుందనే ఆశాభావంతో పనిచేస్తీ, అలా తెప్పించిన సర్వేలను "రికార్డు" purposes కోసం పదిల పరచి వాటిని తరువాత పట్టించుకోని గొప్ప పనితనం చంద్రబాబుది.
@ రచనలు.. విచక్షణ..వగైరా
మీరు ఏమి చెప్పదలచారో నాకు అర్థం అయ్యింది. నేను ఇక మీదట తప్పకుండా చంద్రబాబు పాలనలో మన రాష్ట్రానికి కలిగిన, జరిగిన అభివృద్ధి గురించి రాసే, రాసిన వ్యాసాలను, పేపర్లు చదువతానికి ప్రయత్నిస్తాను.
....
@ రచనలు.. విచక్షణ..వగైరా
మీరు ఏమి చెప్పదలచారో నాకు అర్థం అయ్యింది. నేను ఇక మీదట తప్పకుండా చంద్రబాబు పాలనలో మన రాష్ట్రానికి కలిగిన, జరిగిన అభివృద్ధి గురించి రాసే, రాసిన వ్యాసాలను, పేపర్లు "మాత్రమే" చదువతానికి ప్రయత్నిస్తాను.
"మీరు ఏమి చెప్పదలచారో నాకు అర్థం అయ్యింది. నేను ఇక మీదట తప్పకుండా చంద్రబాబు పాలనలో మన రాష్ట్రానికి కలిగిన, జరిగిన అభివృద్ధి గురించి రాసే, రాసిన వ్యాసాలను, పేపర్లు "మాత్రమే" చదువతానికి ప్రయత్నిస్తాను. "
@అంజి
మీరు అలా అర్ధం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నా అవగాహనా శక్తికి, నాకూ వచ్చే నష్టమేమీ లేదు. నేను మీ ముందుకు నేను ఆకళింపు చేసుకున్నదాన్ని తీసుకొచ్చాను, అంతే..
ఇక బ్లాగుల లంకెలంటే ప్రస్తుతం అంత తీరిక లేదు. తీరిక దొరికినప్పుడు తప్పకుండా వస్తా...
@ఏకాంతపు దిలీప్
constructive సంభాషనలని నేను ఎప్పుడూ స్వాగతిస్తాను. మీరు "విచక్షణ" గూర్చి రాసినదానికి i took offence. అందు వలన కాస్తింత వ్యంగ్యం విసిరే ప్రయత్నం చేసాను. అంతే. అలకువ నా ఉద్దేశం కాదు అని గమనించగలరు.
మిగిలినవన్నీ యదాతధం.
Post a Comment