మిస్టరీ ఫలితం ??
Thursday, May 14, 2009
ఎక్కడో లోపల తన్నుతోంది. ఎవడో ఆకాశరామన్న నా తలలో కూస్తున్నాడు. అస్సలు ఎవరూ ఊహించని ఫలితం వస్తుంది అని.
కేంద్రంలో అయితే సర్వేలనీ తారుమారు అయ్యి భాజాపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని గట్టిగా అనిపిస్తుంది. మన రాష్ట్రంలోనే ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ కన్నా ఏదో వింత జరగబోతుంది అనే ఒక ఫీలింగు.
కనీసం గత ఇరవై నాలుగు గంటలుగా తల పగిలిపోతుందండీ బాబు. రేపు ఈ టైం వరకూ వెయిట్ చేయాలా !!!
కొసమెరుపు:
నిన్నటి సాక్షి సర్వ్ చూసే ఉంటారు కదా. అస్సలు సిస్సలు కాంగ్రెస్ వాదులు కూడా నమ్మలేనట్టుగా కాంగ్రెస్ 180 పైగా సీట్లు వస్తాయి అని జోస్యం చెప్పాడు. సర్వేలకు సర్వే అనే పేరు తీసి జోస్యం అని చ్పెడితే బావుండు
2 comments:
కాంగ్రెస్ MIM సపోర్ట్ తో గట్టు ఎక్కగలదు కానీ సొంత మెజారిటీ వస్తుందనుకోని. ఇక మహా కూటమంటారా? అది మాయ నాటకాల రాయుళ్ళ కూటమి. గతంలో రాఘవులు చంద్రబాబు నాయుడిని ఎలా బూతులు తిట్టాడో జనానికి గుర్తు ఉంది. చంద్రబాబు నాయుడు కమ్యూనిజం పేరు వింటేనే మండిపడిపోయే రకం మనిషి. అతను సడెన్ గా రాఘవులుతో చేతులు కలిపితే జనం ఇద్దరినీ నమ్మరు. ప్రజారాజ్యం ప్రభావం వల్ల కాంగ్రెస్ కి కనీసం పది పన్నెండు సీట్లైనా తగ్గుతాయంటే నమ్మొచ్చు. లోక్ సత్తా ప్రభావం వల్ల ఒకటి రెండు సీట్లైనా తగ్గొచ్చు. ఇవేమీ తగ్గవు అని అర్థమొచ్చేలాగ వ్రాయడం మాత్రం బాగాలేదు. హంగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారం మళ్ళీ పక్కా దివాలాకోరు తెలుగు దేశం పార్టీ చేతులలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.
MIM మహా అయితే ఒక అరడజను సీట్లు కొడుతుంది. అంత చిన్న మార్జిన్ తేడా వస్తే పెద్ద సమస్యే కాదు.ఏ పార్టీకైనా. వేరే పార్టీలనుండి ఏమ్యేల్యేలను చీల్చడం మన నాయకులకు తెలియని విద్య కాదు కదా. (క్రితం సంవత్సరం మందా జగన్నాథం, ఆదికేసవులు నాయుడు కొట్టిన పల్టీ గుర్తు ఉండేఉంటుంది.)
చంద్ర బాబు రాకుండా ఏమి జరిగినా పర్లేదు అనిపిస్తుంది నాకు.
హడావుడిలో మరచిపోయాము. జే పీ గెలిస్తే బావుండు.
Post a Comment