ఎన్నికల ఫలాలు ఫలితాలు.
Saturday, May 16, 2009
ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ మొత్తానికి వదిలింది. ఆశించిన విధంగానే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు, దివాలాకోరుతనపు వాగ్దానాలు మాకు వద్దు అని రాష్త్రప్రజలు ముక్తకంటంతో తమ వోటు ద్వారా పలికారు.
కుయుక్తులతో ప్రజా శ్రేయస్సు కన్నా పక్షపాతానికే పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేయాలనే దుర్బుద్ధితో అనుదినం వక్రభాష్యాలతో, కుల ప్రీతులతో కూడా పుట్టిన జర్నలిజానికి జనం "చెంప దెబ్బ" కొట్టారు. దెబ్బ అంటే అలా ఇలా కాదు, ఐదేళ్ళు గుర్తుండేలా కొట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో పూర్తి మెజారిటీ ఇవ్వడమే కాకుండా కేంద్రానికి కూడా రికార్డు సంఖ్యలో యం.పి లను పంపారు.
కేంద్ర ఫలితాలు నాకు వ్యక్తిగతంగా చాల నిరాస కల్గించినా దేశ ప్రజలు తమ వోటింగు పధ్ధతి ద్వారా ఒక సంపూర్ణ సందేశాన్ని పంపారు. కేంద్రాన్ని గత ఐదేళ్ళుగా పాలిస్తున్న మన్మోహన్ సింగు ప్రభుత్వానికే మరింత శక్తిని ఇచ్చి, కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో ఉతాన్నిచ్చారు.
కేంద్రంలో యుపిఏ కొత్త ప్రభుత్వాన్ని స్తాపించాలంటే కేవలం మరొకొఅ డజను మంది యంపి ల మద్ధతు సేకరిస్తే సరిపోతుంది. ఇటు వండి మెజారిటీ యు పి ఏ కూటమికి అనేక పాలాన మరియు పాలసీ పరమయిన నిర్ణయాలను తీసుకునేందుకు మరింత స్వేచ్చనిస్తుంది.
0 comments:
Post a Comment